సాంబ సదా శివ

by Revathi
(Bangalore)


సామ్బ సదాశివ సామ్బ సదాశివ ।
సామ్బ సదాశివ సామ్బ శివ ॥

అద్భుతవిగ్రహ అమరాధీశ్వర
అగణిత గుణగణ అమృత శివ - హర - సామ్బ
ఆనన్దామృత ఆశ్రితరక్షక
ఆత్మానన్ద మహేశ శివ - హర - సామ్బ
ఇన్దుకలాదర ఇన్ద్రాదిప్రియ
సున్దరరూప సురేశ శివ - హర - సామ్బ
ఈశ సురేశ మహేశ జనప్రియ
కేశవ సేవిత కీర్తి శివ - హర – సామ్బ
ఉరగాదిప్రియ ఉరగవిభూషణ
నరకవినాశ నతేశ శివ - హర - సామ్బ
ఊర్జితదాన వనాశ పరాత్పర
ఆర్జితపాపవినాశ శివ - హర - సామ్బ
ఋగ్వేదశ్రుతి మౌలి విభూషణ
రవి చన్ద్రాగ్నిత్రినేత్ర శివ - హర - సామ్బ
ౠపనామాది ప్రపఞ్చవిలక్షణ
తాపనివారణ తత్వ శివ - హర - సామ్బ
ఌల్లిస్వరూప సహస్రకరోత్తమ
వాగీశ్వర వరదేశ శివ - హర - సామ్బ
ౡతాధీశ్వర రూపప్రియ హర
వేదాన్తప్రియ వేద్య శివ - హర - సామ్బ
ఏకానేక స్వరూప సదాశివ
భోగాదిప్రియ పూర్ణ శివ - హర - సామ్బ
ఐశ్వర్యాశ్రయ చిన్మయ చిద్ఘన
సచ్చిదానన్ద సురేశ శివ - హర - సామ్బ
ఓఙ్కారప్రియ ఉరగవిభూషణ
హ్రీణ్ఙ్కారప్రియ ఈశ శివ - హర - సామ్బ
ఔరసలాలిత అన్తకనాశన
గౌరిసమేత గిరీశ శివ - హర - సామ్బ
అమ్బరవాస చిదమ్బర నాయక
తుమ్బురు నారద సేవ్య శివ - హర - సామ్బ
ఆహారప్రియ అష్ట దిగీశ్వర
యోగిహృది ప్రియవాస శివ - హర - సామ్బ
కమలాపూజిత కైలాసప్రియ
కరుణాసాగర కాశి శివ - హర - సామ్బ
ఖడ్గశూల మృగ టఙ్కధనుర్ధర
విక్రమరూప విశ్వేశ శివ - హర - సామ్బ
గఙ్గా గిరిసుత వల్లభ శఙ్కర
గణహిత సర్వజనేశ శివ - హర - సామ్బ
ఘాతకభఞ్జన పాతకనాశన
దీనజనప్రియ దీప్తి శివ - హర - సామ్బ
ఙాన్తాస్వరూపానన్ద జనాశ్రయ
వేదస్వరూప వేద్య శివ - హర - సామ్బ
చణ్డవినాశన సకలజనప్రియ
మణ్డలాధీశ మహేశ శివ - హర - సామ్బ
ఛత్రకిరీట సుకుణ్డల శోభిత
పుత్రప్రియ భువనేశ శివ - హర - సామ్బ
జన్మజరా మృత్య్వాది వినాశన
కల్మషరహిత కాశి శివ - హర - సామ్బ
ఝఙ్కారప్రియ భృఙ్గిరిటప్రియ
ఓఙ్కారేశ్వర విశ్వేశ శివ - హర - సామ్బ
జ్ఞానాజ్ఞాన వినాశన నిర్మల
దీనజనప్రియ దీప్తి శివ - హర - సామ్బ
టఙ్కస్వరూప సహస్రకరోత్తమ
వాగీశ్వర వరదేశ శివ - హర - సామ్బ
ఠక్కాద్యాయుధ సేవిత సురగణ
లావణ్యామృత లసిత శివ - హర - సామ్బ
డమ్భవినాశన డిణ్డిమభూషణ
అమ్బరవాస చిదేక శివ - హర - సామ్బ
ఢణ్ఢణ్డమరుక ధరణీనిశ్చల
ఢుణ్ఢివినాయక సేవ్య శివ - హర - సామ్బ
ణాణామణిగణ భూషణనిర్గుణ
నతజనపూత సనాథ శివ - హర - సామ్బ
తత్వమస్యాది వాక్యార్థ స్వరూప
నిత్యస్వరూప నిజేశ శివ - హర - సామ్బ
స్థావరజఙ్గమ భువనవిలక్షణ
తాపనివారణ తత్వ శివ - హర - సామ్బ
దన్తివినాశన దలితమనోభవ
చన్దన లేపిత చరణ శివ - హర - సామ్బ
ధరణీధరశుభ ధవలవిభాసిత
ధనదాదిప్రియ దాన శివ - హర - సామ్బ
నలినవిలోచన నటనమనోహర
అలికులభూషణ అమృత శివ - హర - సామ్బ
పార్వతినాయక పన్నగభూషణ
పరమానన్ద పరేశ శివ - హర - శామ్బ
ఫాలవిలోచన భానుకోటిప్రభ
హాలాహలధర అమృత శివ - హర - సామ్బ
బన్ధవిమోచన బృహతీపావన
స్కన్దాదిప్రియ కనక శివ - హర - సామ్బ
భస్మవిలేపన భవభయమోచన
విస్మయరూప విశ్వేశ శివ - హర - సామ్బ
మన్మథనాశన మధురానాయక
మన్దరపర్వతవాస శివ - హర - సామ్బ
యతిజన హృదయాధినివాస
విధివిష్ణ్వాది సురేశ శివ - హర - సామ్బ
లఙ్కాధీశ్వర సురగణ సేవిత
లావణ్యామృత లసిత శివ - హర - సామ్బ
వరదాభయకర వాసుకిభూషణ
వనమాలాది విభూష శివ - హర - సామ్బ
శాన్తి స్వరూపాతిప్రియ సున్దర
వాగీశ్వర వరదేశ శివ - హర - సామ్బ
షణ్ముఖజనక సురేన్ద్రమునిప్రియ
షాడ్గుణ్యాది సమేత శివ - హర - సామ్బ
సంసారార్ణవ నాశన శాశ్వత
సాధుజన ప్రియవాస శివ - హర - సామ్బ
హరపురుషోత్తమ అద్వైతామృత
మురరిపుసేవ్య మృదేశ శివ - హర - సామ్బ
లాలిత భక్తజనేశ నిజేశ్వర
కాలినటేశ్వర కామ శివ - హర - సామ్బ
క్షరరూపాభి ప్రియాన్విత సున్దర సాక్షాత్
స్వామిన్నమ్బా సమేత శివ - హర - సామ్బ
సామ్బ సదాశివ సామ్బ సదాశివ
సామ్బ సదాశివ సామ్బ శివ

Click here to post comments

Join in and write your own page! It's easy to do. How? Simply click here to return to Post Your Lyrics.