Bathukamma songs

by Revathi
(Bangalore)





రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో
రామ రామానంది రాగమెత్తా రాదు
హరిహరియ ఓ రామ హరియ బ్రహ్మ దేవ
హరియన్న వారికి ఆపదలు రావు
శరణన్న వారికి మరణంబు లేదు
రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో
రామ రామానంది రాగమెత్తా రాదు
ముందుగా నిను తల్తు ముత్యాల పోషమ్మ
తర్వాత నిను తల్తు తల్లిరో పెద్దమ్మ
ఆదిలో నిను తల్తు అయిలోని మల్లన్న
కోరుకా నిను తల్తు కొంరెల్లి మల్లన్న
మారునా నిను తల్తు మావురాల ఎల్లమ్మ
బోగాన నిను తల్తు బొంతపల్లి ఈరన్న
శరణన్న వరంగల్లు శంభుడా నినుతల్తు
భద్రంగా జీడమ్మ భద్రకాళీ తల్లీ
చల్లగా నిను తల్తు చాముండీ మాత
రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో
రామ రామానంది రాగమెత్తా రాదు
పొద్దున్నే భూదేవి మొక్కుదునే నిన్ను
బాధల్లి నిను తల్తు భద్రాద్రి రామన్న
గుండెల్లో నిను తల్తు కొండగట్టంజన్న
ఎప్పుడూ నినుతల్తు ఎములాడ రాజన్న
యాదిలో నినుతల్తు యాదగిరి నర్సన్న
చింతల్లో నినుతల్తు సమ్మక్కసారక్క
కీర్తిగా నినుతల్తు కీసరా రామన్న
రామ రామ రామ కోదండ రామ
రామ రామ రామ భద్రాద్రి రామ
రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో
రామ రామానంది రాగమెత్తా రాదు
అందరినీ తలిశి గంగా నిము మరిసి
గంగ నిను తల్వంది గడియ నిలువాలేము
మోతుకూ చెట్టు కింద పుట్టినావే గంగ
మొలమంటి కాల్వలు పారినావే గంగ
తంగేడు చెట్టు కింద పుట్టినావే గంగ
తల్లేడు కాల్వలు పారినావే గంగ
జిల్లేడు చెట్టు కింద జిల జిల కాల్వలు
ఊరుమూ చెట్టు కింద పుట్టినావే గంగ
ఉరిమి ఉరిమి కాల్వలు పారినావే గంగ
కట్టినావు గంగ పట్టంచు చీరలు
తొడిగినావు గంగ ముత్యాల రవికెలు
పూసినావు గంగ పుట్టెడు బంగారు
పెట్టినావు గంగ గవ్వల మండ్రాలు
గంగ నువ్వు లేక గడియ నిల్వ లేము
గంగ నీకు శరణు తల్లి నీకు శరణు
కాపాడి మమ్మేలు కైలాస రాణి

Click here to post comments

Join in and write your own page! It's easy to do. How? Simply click here to return to Post Your Lyrics.